కాంగ్రెస్ పార్టీలో కి భారీగా చేరికలు
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం ప్రతినిధి : ఏటూరునాగారం మండల కేంద్రంలో ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క సమక్షంలో ఆదివారం వివిధ పార్టీల నేతలు,వార్డు మెంబర్లు, మేస్త్రిలు, మహిళలు, ఉపాధ్యాయ యూనియన్ సభ్యులు దాదాపు 200 మంది కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్బంగా వారికి సీతక్క కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందని,ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి 5లక్షల రూపాయలు కల్పిస్తుందని అన్నారు. రైతులకు,కౌలు రైతులకు 15 వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12వేలు,ప్రతి క్వింటా మీద 500 రూపాయల బోనస్ కల్పిస్తుందని అన్నారు.అంతే కాక మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు,500 కె గ్యాస్ సిలిండర్,ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందని తెలిపారు. ఆసరా చేయూత పెన్షన్ 4వేల రూపాయలు కల్పిస్తుందని,10 లక్షల రాజీవ్ గాంధీ ఆరోగ్య భీమా కాంగ్రెస్ కల్పిస్తుందని అలాగే నిరుద్యోగులకు 4వేల రూపాయలు నిరుద్యోగ భృతి,రైతులకు 24 గంటల కరెంటు రాబోవు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్,నియోజకవర్గ కోర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న,జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్,మండల అధ్యక్షులు చిటమట రఘు,రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు,జిల్లా అనుబంధ సంఘాల నాయకులు,మండల ముఖ్య నాయకులు, మండల అనుబంధ సంఘాల నాయకులు, టౌన్ నాయకులు,గ్రామ నాయకులు,యూత్ నాయకులు,మహిళా నాయకులు,సహకార సంఘ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.