కాంగ్రెస్ పార్టీకి ప్రజల నీరాజనాలు. 

Written by telangana jyothi

Published on:

కాంగ్రెస్ పార్టీకి ప్రజల నీరాజనాలు. 

  • మోసపూరిత వాగ్దానాల బిఆర్ఎస్ ను తరిమికొట్టండి.
  • ముఖ్య కార్యకర్తల సమావేశంలో నాయకుల పిలుపు. 
  • ఆశీర్వదించండి అండగా ఉంటా…
  • భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య.

 వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం రెండవసారి టికెట్ కేటాయించిందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు అందరు కలిసికట్టుగా మరల కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తనను ఆశీర్వదించాలని, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం సొసైటీ ఫంక్షన్ హాల్ వద్ద ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రసంగించారు. టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత పాలన విధానంతో, ప్రజలు విసుగు చెందారని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాదించి అదికారం లోకి వస్తుందని జొస్యం చెప్పారు. అందులో భాగంగా భద్రాచలం శాసనసభ్యు నిగా ప్రజలు తిరిగి ఆశీర్వదించి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోరారు. రానున్న 30 రోజుల్లోపు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడుగా పనిచేసే బిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలతో విసుకు చెందిన ప్రజలకు కనువిప్పు కలిగించి, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసే విధంగా కష్టపడి పని చేయాలని ఈ పార్టీ కార్యకర్తల హర్షధానాల మధ్య సమావేశంలో పిలుపునిచ్చారు. సభకు పిఎసిఎస్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిడెం మోహన్రావు అధ్యక్షత వహించారు. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వెంకటాపురం జడ్పిటిసి పాయం రమణ, మాజీ ఎమ్మెల్సీ బాల సాని లక్ష్మీనారాయణ సోదరులు శ్రీనివాసరావు , వారి అన్న కుమారులు బాలసాని వేణు, సర్పంచులు సమావేశంలో పాల్గొన్నారు. జడ్పిటిసి పాయం రమణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ పెరుగుతున్నదని, మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా స్వీకరించే విధంగా, పూర్తిస్థాయి మద్దతుతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ముఖ్య కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు ఆఫర్లు ప్రకటించిన మన భద్రాచలం ఎమ్మెల్యే పీ. వీరయ్య నీతి నిజాయితీగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పేద ప్రజల పక్షాణ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వం కొట్లాడి నిధులు తెప్పించారని, అటువంటి మహానాయకుడు ను గెలిపించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం లో క్యాబి నెట్ మంత్రిగా మన ప్రాంతా అభివృద్ధికి మనమందరం కృషిచేసి క్యాబినెట్ మంత్రిగా మన ఎమ్మెల్యే గారిని పదవిలో కూర్చోబెట్టలని ఈ సందర్భంగా సీనియర్ నాయకులు బాలసానీ వేణు కోరారు. ఇంకా ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు చిడెం సాంబశివరావు, మన్యం సునీల్, అనేక మంది నాయకులు ప్రసంగించారు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే వీరయ్య వారిని పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ప్రతి కార్యకర్త గ్రామాలలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఇందిరమ్మ రాజ్యం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తల హర్షద్వానాల మధ్య పిలుపునిచ్చారు. పార్టీ సర్పంచులు, కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి తరలివచ్చారు. అనంతరం మండల కేంద్రంలోని జగదాంబ థియేటర్ వీధిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఎలక్షన్ కమిషన్ స్వాడ్ అధికారులు ముఖ్య కార్యకర్తల సమావేశం నిఘా నేత్రం తో పరిశీలించారు. వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రేఖ అశోక్ పోలీస్ సిబ్బంది ఎమ్మెల్యే ముఖ్య కార్యకర్తల సమావేశం, పార్టీ కార్యాలయాలు ప్రారంభం తదితర సమావేశాల వద్ద ఎటువంటి గొడవలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య కార్యకర్తల సమావేశం తో వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తెజం కలిగిందని, పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పార్టీ ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు పిట్టా సాయిబాబు రెడ్డి, మన్యం సునీల్, పిఎసిఎస్ చైర్మన్ మోహన్రావు‌ , సీతాదేవి, రవి ఇంకా పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now