కాంగ్రెస్ పార్టీకి పస్ర గ్రామం ముద్దబోయిన రవికి ఎటువంటి సంబంధం లేదు.

కాంగ్రెస్ పార్టీకి పస్ర గ్రామం ముద్దబోయిన రవికి ఎటువంటి సంబంధం లేదు.

తెలంగాణ జ్యోతి ,నవంబర్ 21, గోవిందరావుపేట : మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకుల సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్ హాజరయ్యారు ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ముడ్డబోయిన రవికి ఎటువంటి సంబంధం లేదని, కొందరు అధికార పార్టీ నాయకుల కుట్ర వల్ల మా పార్టీ కండువా పట్టుకుని తిరుగుతూ కాంగ్రెస్ పార్టీనీ, సీతక్క పై అసత్య ప్రచారామే లక్ష్యంగా అతన్ని ఉసిగొల్పారన్నారు. ప్రతి ఒక్కరి ఆత్మ బంధువు సీతక్క అని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుస్తుందని, కానీ కొందరు చేసే చిల్లర ప్రచారాలకు సీతక్క గారికి ఎటువంటి సంబంధం లేదని, సీతక్క వస్తేనే అందరికీ సాగు చేసుకునే ప్రతి ఒక్కరికీ సాగు భూమి పట్టాలు వస్తాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలోనే ధరణి పోర్టల్ రద్దు చేస్తాం అని, భూమాత పోర్టల్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు పట్టాలు అందిస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. పట్టా ఉన్న రైతుకు ఏడాదికి 15 వేల రూ. అందిస్తాం అని, రైతు కూలీలకు కూడా ఏడాదికి 12 వేల రూ. అందిస్తాం అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల రైతు లాభపడింది ఏమి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సీతక్కని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ఏకకాలంలో రైతు యొక్క పంట ఋణం 2 లక్షల వరకు మాఫీ చేస్తుందని అన్నారు. రైతు సోదరులారా ఆలోచించండి అన్ని వర్గాల వారికి పట్టాలు అందించే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గిరిజన రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు అందరూ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment