కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే వీరయ్య విస్తృత ఎన్నికల పర్యటన.
– గ్రామాల్లో ప్రజల నీరాజనాలు.
– పూలజల్లులు మంగళహారతిలతో స్వాగతం.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : భద్రాచలం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదెం వీరయ్య నియోజకవర్గం పరిధిలోని ములుగు జిల్లా వాజేడు మండలంలో శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏడు చర్లపల్లి జి.ఫి ముత్తారం కాలనీ నుండి ప్రచార రధాలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థి వీరయ్యకు మేళతాళాలతో మంగళహారతులతో మహిళలు పూల వర్షంతో స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని,పేదలు , రైతుల జీవితాలను వెలుగులు నింపేందుకే రైతు డిక్లరేషన్, 6 గ్యారంటీల పథకాలతో పేదలను ఆదుకునేందుకు తయారుచేసిన ఇందిరమ్మ రాజ్యం కోసం కృషి చేస్తున్న, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్యకు స్వాగతం పలుకుతూ, తామంతా హస్తం గుర్తుకు ఓటేసి వేసి గెలిపించుకుంటామని ఈ సందర్భంగా ఓటర్లు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వీరయ్య రోడ్ షో, కార్నర్ మీటింగ్లకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు వ్యవసాయ పనులు మానుకొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో పాల్గొన్నారు. పంచాయతీలోని ముత్తారం కాలనీ, ఏడుజెర్లపల్లి, కొత్తూరు గ్రామాల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోడ్ షోలో పాల్గొని కార్నర్ మీటింగ్లలో, కాంగ్రెస్ పార్టీ మేనే పోస్టు ను వివరాలను వివరించారు. బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదని, అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని, ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పేదల జీవితాలలో వెలుగులు రాలేదని, మాయమాటలకు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా ఓటర్లకు, జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అనే నినాదాలతో మద్య ఎంఎల్ఎ ప్రసంగించారు. ఇందిరమ్మ రాజ్యం వస్తున్నదని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, ఈ సందర్భంగా అన్నారు. అనంతరం బొమ్మనపల్లి, పాయబాటల, జగన్నాధపురం, ధర్మారం,పేరూరు ఇంకా అనేక గ్రామాల్లో భద్రాచలం ఎమ్మెల్యే విస్తృతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. వాజేడు మండలం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిటింగ్ ఎమ్మెల్యే వీరయ్య ప్రచార రథాలకు గ్రామస్తులు, ఓటర్లు ఘన స్వాగతం పలికారు. రైతులు, కార్మికులు అనేకమంది మహిళలు,పొలం పనులు మాను కొని అభిమాన నేత వీరయ్యకు ఘన స్వాగతం పలికి ,హస్తం గుర్తుకు ఓటు వేసి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజానాయకుడు వీరయ్యని గెలిపించుకుంటామని ఇందిరమ్మ రాజ్యం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నామని ఈ సందర్భంగా ఓటర్లు స్వాగత సన్నహాలతో జై కాంగ్రెస్ జై జై వీరన్న ఇందిరమ్మ రాజ్యం రావాలి ,పేదల కష్టాలు తీరాలి అంటూ మహిళలు మంగళహారతులతో స్వగతం పలికారు. ఈ సందర్భంగా అనేక వందల మంది వివిధ పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్టు ప్రకటించడంతో, వారందరిని పార్టీ కండు వాలు కప్పి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వీరయ్య వారికి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా వాజేడు, పేరూరు పోలీసులు విస్తృతంగా బందోబస్తు కార్యక్రమం నిర్వహిం చారు.ఈ కార్యక్రమంలో వాజేడు కాంగ్రెస్ పార్టీ నాయకు లు ప్రసాద్ బాబు, విక్రాంత్, టి. ఆదినారాయణ, పూనెం రాంబాబు, పార్టీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన కాంగ్రెస్, మహిళా నాయకురాళ్ళు పెద్ద సంఖ్యలో పాల్గొని భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన వీరయ్య ఎన్నికల ప్రచార కార్యక్ర మాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఇస్తున్న ఆదరణ చూసి ఎన్నికల ప్రచార బృందం ఆనంధం తో జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మా అన్న వీరయ్యను గెలిపించుకుం టాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాధించుకుంటాం అంటూ గ్రామస్తులు నినాదాలు చేస్తూ ఎన్నికల ప్రచారం ను హోరెత్తించారు.