కరుడుగట్టిన కాషాయవాది తిరుపతి బిజెపికి గుడ్ బై
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకుడు దుర్గం తిరుపతి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 1998 నుంచి పార్టీ లో చేరి ఎత్తిన కాషాయ జెండాను నేటి వరకు మోసిన దుర్గం తిరుపతి తన ఇంటి పేరునే బీజెపీ తిరుపతి గా మార్చుకున్నారు. మూడు సార్లు కాటారం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా, ఉమ్మడి జిల్లా బిజెపి ప్రచార కార్యదర్శిగా, ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజెపీ కోశాధికారిగా కొనసాగుతున్న దళిత నాయకుడు భాజపా నాయకుడు దుర్గం తిరుపతి రాజీనామా పట్ల సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బిజెపి పార్టీలో దళిత నాయకత్వానికి విలువ లేదని ఆయన ఆరోపించారు. త్వరలో కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను వెల్లడిస్తానని దుర్గం తిరుపతి అన్నారు.
1 thought on “కరుడుగట్టిన కాషాయవాది తిరుపతి బిజెపికి గుడ్ బై ”