ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థులు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంథని నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే భారత రాష్ట్ర సమితి అభ్యర్థి పుట్ట మధుకర్ మంథని మండలం వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి చల్ల నారాయణరెడ్డి కాటారం మండలం గారేపల్లి లో తన ఓటు హక్కును వేయించుకున్నారు. మంథని నియోజకవర్గం లోని కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమల మండలాలలో ఉదయం సాధారణంగా సాగిన పోలింగ్, మధ్యాహ్నం ఊపందుకుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియను అధికారులు నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
1 thought on “ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థులు”