ఒక్కసారి అవకాశం ఇవ్వండి : అభివృద్ధి చేసి చూపిస్తా…
– పిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం నగేష్
– కాటరంలో విస్తృత ప్రచారం
తెలంగాణ జ్యోతి,కాటారం ప్రతినిధి: ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేస్తూ మంథని నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తానని, పిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం నగేష్ ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కాటారం మండల కేంద్రంతో పాటు ఇప్పల గూడెం గ్రామంలో ఇంటింటా ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు కరపత్రాలు అందిస్తూ తనకు ఒక్క అవకాశం కల్పించి విజిల్ (ఈల) గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.అనంతరం ఆయన మాట్లాడు తూ ఈ స్వతంత్ర దేశ 75 సంవత్సరాల పాలనలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు దళారులకు కొమ్ము కాస్తూనే ఉన్నారని, అందువల్ల దేశ సంపద కొద్ది మంది చేతుల్లో ఉందని, తద్వారా పేదవాళ్లు పేదవాళ్లుగా ఉంటున్నారని ధనికులు ఇంకా ధనవం తులు అవుతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వాల పాలకులు రాజ్యాంగం కల్పించిన కనీస సౌకర్యాలు కూడు ,గుడ్డ, విద్య వైద్యం, ఈ కల్పించడం లేదని ఆరోపించారు. తనను ఆదరించి గెలిపిస్తే ప్రజలకు ఎళ్లప్పుడు అందుబాటులో ఉండి భారత రాజ్యాంగం ద్వారా రావలసిన హక్కులు రిజర్వేషన్లు అన్ని వర్గాల ప్రజలకు అందేలా కృషి చేస్తానన్నారు .నాణ్యమైన రోడ్లతో పాటు రెవెన్యూ వ్యవస్థ, ప్రభుత్వ రంగ సంస్థలను సక్రమంగా నడిపిస్తామని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ఉంటూ పేదల పక్షాన పోరాటం చేస్తూ అందరికి న్యాయం చేస్తామని అన్నారు. నిజమైన అంబేద్కర్ వాదం గల బహుజన బిడ్డ అయిన తనను ఆశీర్వదించి విజిల్ (ఈల)గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తెలిపించాలని ఓటర్లను కోరారు. ఈకార్యక్రమంలో పిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు పాల్గొన్నారు.