ఎన్నికలలో బీఆర్ఎస్ కు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
– రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి
ములుగు ప్రతినిధి, డిసెంబర్01, తెలంగాణ జ్యోతి : నవంబర్ 30న జరిగిన ములుగు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎ స్ పార్టీ కార్యక్రమాలకు తోడ్పాటు అందించి సహకరించిన ప్రతి ఒక్కరికి రెడ్కో చైర్మన్, తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ములుగు జిల్లా, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా టీముకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ములుగులో గులాబీ జెండా ఎగరేయాలని కంకణబద్ధులై రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైన నాటి నుండి లక్ష్యాన్ని చేరే వరకు పగలు – రాత్రి, ఎండా – వానా అనే తేడా లేకుండా పనిచేసిన ప్రతీ ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. గత నెలరోజులకు పైగా వారు అందించిన సహాయ సహకారాలతో ములుగులో మన అభ్యర్థి బడే నాగజ్యోతి విజయం సాధించ బోతున్నామన్నారు. ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా భవిష్యత్తులో తమ సహాయసహకారాలు ఇదే విధంగా కొనసాగాలని ఆయన కోరారు.