ఎన్నికలకు సర్వం సిద్ధం
– బుధవారం సాయంత్రం కే చేరుకున్న పోలింగ్ సిబ్బంది.
– పోలింగ్ బూత్ ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.
– సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : భద్రాచలం నియోజకవర్గం.పరిదిలోని ములుగుజిల్లా వెంకటాపురం మండ లంలో అధికారులు ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. బుధ వారం సాయంత్రం వరకు పోలింగ్ సిబ్బంది, అదికారులు చేరుకు న్నారు.ఆయా పోలింగ్ బుత్ ల వద్ద త్రాగునీరు,విద్యుత్ ఇతర సౌకర్యాలను వెంకటాపురం మండల తాహసిల్దార్ సమ్మ య్య ఆధ్వర్యంలో, ఎన్నికల కు సంబంధించిన అధికార యంత్రాం గం ఏర్పాటు చేసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో సమస్యత్మక, అత్యంత సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు శాఖ పకడ్బందీ బద్రతా చర్యలు చేపట్టింది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందు కు పోలీస్ శాఖ విస్తృతమైన బందోబస్తు నిర్వహిస్తోంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ వెంకటాపురం సర్కిల్ పరిధిలో ఆదనపు పోలీస్ బలగాలను రప్పించింది. ఆయా ఎన్నికల సిబ్బంది ఈ .వి. ఎమ్ లతో బుధవా రం సాయంత్రం నాటికే ప్రత్యేక ఆర్ టి సి బస్సులలో చేరుకొని ఎన్నికల అధికారులకు జాఇనింగ్ రిపోర్ట్ అందచేసి, అయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొన్నారు. కాగా సమస్యాత్మక, అత్యంత సమస్యా త్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి న పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు లు భద్రతాపరమైన చర్యలు తీసు కుంటున్నారు. జిల్లా పోలీసు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు, వెంకటాపురం సి.ఐ. బండారి కుమార్ ఆధ్వర్యంలో, ప్రత్యేక బలగా లతో భద్రతా చర్యలు చేపట్టా రు. వెంకటాపురం మండలంలో 24 వేల192 మంది ఓటర్ల గాను, 32 బూత్ లలో ఎన్నికలు ప్రశాం తంగా ఎన్నికలు జరిగేందుకు ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహిం చేందుకు అదికారులు ఏర్పాటు చేశా రు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేందుకు అన్ని శాఖల అధికారుల సమ న్వయంతో, పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎం బాక్స్ లను భారీ బందోబస్తు మధ్య తరలిం చేందుకు ఇప్పటినుండే ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాగా ఎన్నికలను బహిష్కరించిన మావోయి స్టులు దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, భావించిన పోలీసులు పటిష్టమైన భద్రత చర్య లు తీసుకున్నట్లు సమాచారం మావోయిస్టుల కదలికలను కనిపెట్టేం దుకు అత్యంత ఆధునీకరమైన డ్రోన్ కెమెరాలను ఏర్పా టు చేసి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఏర్పాటు చేశారు.
1 thought on “ఎన్నికలకు సర్వం సిద్ధం”