ఎదిర గోదావరి రేవు వద్ద భారీగా టేకు కలప పట్టివేత.
– పడవుల గుండా గోదావరి దాటిస్తున్న స్మగ్లర్లు.
వెంకటాపురం, డిసెంబర్09, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధి, వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ లోని ఎదిర బీట్ గోదావరి పడవల రేవు వద్ద భారీగా టేకు కలపను పట్టుకున్నారు. పడవల ద్వారా టేకు కలపను గోదావరి దాటిస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రమోళి కి విశ్వసనీయ, నమ్మద గిన సమాచారంతో శుక్రవారం రాత్రి అట వీశాఖ అధికారులు బేస్ క్యాంపు సిబ్బందితో ఎదిర గోదావరి పెర్రి పాయింట్ వద్ద దాడులు నిర్వహించగా భారీగా టేకు కలప పట్టు పడింది. పట్టుబడిన కలుప దుంగలు రెండున్నర లక్షలకు పైగా ఉంటుందని రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి మీడియాకు తెలిపారు. ఎవరికి అనుమానం రాకుండా గోదావరి ఇసుకలో పాతిపెట్టి, తమకు అనుకూలమైన సమయాల్లో పడవల ద్వారా గోదావరి దాటించి దొంగ కలప స్మగ్లింగ్ చేసి సొమ్ము చేసుకుంటు న్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన కలప సరిహద్దులోని చత్తీస్గడ్ రాష్ట్ర అడవుల నుండి అటవీ మార్గాల గుండా ఎదిర ఫెర్రీ పాయింట్ ద్వారా గోదావరి దాటించి స్మగ్లర్లు అమ్ముకుం టున్నట్లు భావిస్తు న్నామన్నారు. పట్టుబడిన కలప ను ఏటూరు నాగారం ఫారెస్ట్ కార్యాలయానికి తరలించినట్లు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ వివరిం చారు. ఈ దాడిలో ఎదిర సెక్షన్ ఆఫీసర్ రాజేష్, బీట్ ఆఫీసర్ సంతోష్, బేస్ క్యాప్ సిబ్బంది, వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ స్టాప్ తదితరులు ఉన్నారు.