ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం వాస్తవ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ శాసన మండలి సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ గురువారం ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గురు వారం ఉదయం ముహూర్తం సమయానికి తమ శాఖ కార్యాలయం లో పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా, మాజీ ఎమ్మె ల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పుష్పగుచ్చంతో స్వాగతం పలికి, పట్టుశాలు వ తో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ను సెక్రటేరియట్ లో ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రిగా భాద్యతలు తీసుకున్న సందర్భంగా కలిసి, మాజి శాసనమండలి సబ్యులు బాలసాని లక్మినారాయణ శుభాకాంక్షలు తెలిపారు.