ఉప కులాల విశ్వరూప మహాసభ కరపత్రం ఆవిష్కరణ

ఉప కులాల విశ్వరూప మహాసభ కరపత్రం ఆవిష్కరణ

తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి :  ములుగు జిల్లా కేంద్రం లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవరణలో నవంబర్ 11న పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ నందు జరిగే విశ్వరూప మహాసభ విజయవంతం చేయాలని యస్సి ఉపకులాల జాతీయ అధ్యక్షులు గజవెల్లి గణపతి, యస్సి ఉపకులాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చి కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 29 సంవత్సరాలనుండి మాదిగ, ఉపకులాల కు సామజిక న్యాయం ప్రకారం జనాభా తమాషా ప్రకారం రాజ్యాంగ ఫలాలు రిజర్వేషన్లు ను పంచాలని , విద్య ఉద్యగ రాజకీయ ఆర్థిక సంక్షేమ రంగాల్లో అత్యంత వెనుక బడిన చిందు, డెక్కలి ,మాస్టన్ , బేడా బుడగ జంగం, మోచి, పాకీ , మిత్తల్ ,అయ్యగారు ,గోసంగి ,నేతకాని మెదలగు 57 ఉప కులాలు ఉన్నాయి తక్షణమే పార్లమెంట్ లో వర్గీకరణ చట్టంచేసి ఈకులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కరపత్రం ఆవిష్కరించిన వారిలో చిందు హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి, మాస్టన్ హక్కుల పోరాట సమితి ములుగు జిల్లా అధ్యక్షులు బుద్ధుల రమేష్, గోసంగి హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు కొయ్యడ పవన్, బేడా బుడగ జంగాల హక్కుల జిల్లా నాయకులు నీలం రవి, డెక్కలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గౌరరాపు రత్నం,చిందు హక్కుల పోరాట సమితి ములుగు జిల్లా అధ్యక్షులు గడ్డం చిరంజీవి , ములుగు జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి సమన్వయ కర్త నెమలి నర్సయ్య మాదిగ, రాంబాబు, ఆదినారాయణ, శ్రీను ,కిరణ్ ,సుధాకర్ ,తరుణ్ ,పవన్ ,రాజేశ్వర్, తదితర ఉపకులాల నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ఉప కులాల విశ్వరూప మహాసభ కరపత్రం ఆవిష్కరణ”

Leave a comment