ఇసుక లారీల దుమ్ముతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న  ప్రజలు.

Written by telangana jyothi

Published on:

ఇసుక లారీల దుమ్ముతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న  ప్రజలు.

  •  ఇసుక లారీలు నిలిపివేత రాస్తారోకో
  • పోలీసుల పేరు చెప్పి బెదిరింపులు కు పాల్ఫడు తున్న మరి కాల ఇసుక మాఫియా. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికాల గోదావరి ఇసుక సొసైటీ ఆధ్వర్యంలో వందలాది ఇసుక లారీలు బీ.సీ. మరిగూడెం, రంగరాజపురం కాలనీ మరికాల రోడ్డు నుండి లారీలు రాకపోకలు సాగిస్తుండగా, దుమ్ము ధూళి కారణంగా ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, ఇతర అనారోగ్యలతో భాధపడుతున్నారు. దీనికి నిరసనగా సోమవారం సాయంత్రం నుండి వెంకటాపురం పట్టణ శివారు బి.సి.మర్రిగూడెం రంగరాజపురం కాలని ప్రజలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద రాస్తారోకో నిర్వహించి,సోమవారం సాయంత్రం ఇసుక లారీలను నిలిపివేశారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో, గత మార్చి నెలలో వెంకటాపురం నుండి ఏడిజెర్లపల్లి వరకు .12. కి.మి .వరకు కాంట్రాక్టర్ సుమారు అఇదు నెలల క్రితం పాత రోడ్డు స్థానంలో నూతన రోడ్డు నిర్మాణం కొరకు మెటల్ పోసి తారు వేయకుండా, అర్దాంతంరంగా వదిలేశారు. దీంతో మెటల్ పరిచిన రోడ్ పై ఇసుక లారీల రాకపోకల కారణంగా విపరీతమైన దుమ్ము ధూళీ లేసి, రంగరాజపురం కాలనీ, మరిగూడెం పై మబ్బుల తెరలగా కమ్మివేస్తున్నది. దీంతో అనేకమంది శ్వాసకోశ వ్యాధులు, ఇతర వ్యాధులతో కూలీ నాలీ చేసుకునే పేద ప్రజలు, అనారోగ్యం పాలవుతున్నారు. ఈ విషయంపై పలుమార్లు సంబంధిత అధికారులకు, మరికాల ఇసుక కాంట్రాక్టర్లకు తెలియపరచిన పట్టించుకోవడంలేదని ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సోమవారం సాయంత్రం నుండి ఇసుక లారీల రాకపోకల నిలిపివేశారు. గతంలో రెండు మూడు పర్యాయాలు ఇసుక లారీలు నిలిపివేసిన ప్రజలను పోలీస్ శాఖ వారితో తమ ను ఇబ్బందులను గుర్తించ కుఃడా ఆ శాఖ వారితో బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు. నిత్యం వందలాది లారీలు మరికాల గోదావరి నుండి ఒవర్ లోడ్ తో బి.టి వేయని రోడ్డు నుండి రాకపోకలు సాగిస్తూ ఉండడంతో సుమారు 1,000 కుటుంబాలు కలిగిన బి.సి మరిగూడెం పంచాయతీ గ్రుహాలపై ఉపరితలంపై దుమ్ము దూళీ కమ్మి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. మరి కాల ఇసుక సొసైటీ కాంట్రాక్టర్లు పలుకుబడి కలిగి,అదికారపార్టీ వారు కావటంతో , ఆర్ అండ్ బి కాంట్రాక్టర్లను ప్రభావితం చేసి, బీటీ వేయకుండా నిలిపివేశారని, అంతే కాకుండా దుమ్ము వస్తే మేమేం చేయాలి.అందరికి డబ్బులు ఇచ్చాం.ఇసుక అమ్ము కోవద్దా అంటూ బెదిరింపులు తో , లారీ లులాపిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తామని బెదిరింపు చర్య లకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం వందలాది మంది బీసీ మరిగూడెం రంగరాజపురం కాలనీ ప్రజలు, ఇసుక లారీల నిలిపివేశారు. ఈ విషయంపై బీసీ మర్రిగూడెం పంచాయతీ పాలకవర్గం సైతం స్పందించకుండా, ఏవో వంకలు చెప్పుకుంటూ తప్పించుకుంటు న్నారని ప్రజలు బాధ దుమ్ము ధూలి విషయం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికాల కాంట్రాక్టర్ అనుచరులు అధికార పార్టీ వారు కావడంతో మెటల్పై బీ.టి వేయకుండా నిలిపివేసి, దుమ్ము ధూళి తో వేలాదిమంది ప్రజల ను అనారోగ్యం పాలు చేస్తున్నారని, దీనిపై ములుగు జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ యంత్రాంగం స్పందించాలని గ్రామ ప్రజలు సోమవారం రాత్రి మీడియాకు తమ ఆందోళన, తమ అనారోగ్య పరిస్థితులు, దుమ్ముధూళి పై ఆవేదన వ్యక్తం చేస్తూ పత్రిక ముఖఃగా విజ్ఞప్తి చేశారు. కూలినాలి చేసుకునే పేదలము అఇన తమకు న్యాయం చేయాలని, ఈ సందర్భంగా పత్రికా ముఖంగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

ఇసుక లారీల దుమ్ముతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న  ప్రజలు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now