ఆలుబాక, భోదాపురంలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం. 

ఆలుబాక, భోదాపురంలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం. 

ముందుండి నడిపించిన పార్టీ నేతలు : తరలివచ్చిన కార్యకర్తలు

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోదాపురం, ఆలుబాక పంచాయతీ లలో భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు గెలుపును ఆకాంక్షిస్తూ మండల పార్టీ అధ్యక్షులు గంపా రాంబాబు పర్యవేక్షణలో,పార్టీ సీనియర్ నాయకులు ఎండి ముస్తఫా ఆధ్వర్యం లో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. వ్యవసాయ పనులు, మిర్చి తోటలలో పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చిన రైతులు, వ్యవసాయ కూలీలు, ఆదివాసీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలతో బి. ఆర్ ఎస్ పార్టీ ఎన్నికల మెనిపోఫ్టు ఆకర్షణీయమైన కరపత్రాలతో రాత్రి పొద్దుపోయే వరకు ప్రతి ఓటర్ ని కలిసి కారు గుర్తుకు ఓటు వేసి మన భద్రాచలం అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావును గెలిపిం చుకోవాలని ఓటర్లకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రభుత్వం అమలుపరుస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి కుటుంబంలో లబ్ధిదారులకు అందుతుం దని, కల్ల బొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ బిజెపి పార్టీల మాటలు నమ్మవద్దని, మన తెలంగాణ, మన ముఖ్యమంత్రి కెసిఆర్ , మన రాష్ట్రం అనే నిదానంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలతో దేశంలోనే ముందంజలో ఉన్నారని, మన భద్రాచలం అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు ను గెలిపించుకొని, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా ఓటర్లను కలిసి అభ్యర్థించారు. గ్రామ గ్రామాన వీధి వీధిలో ప్రతి ఓటర్ ను కలిసి కారు గుర్తుకు ఒటు వేసి గెలిపించుకొని మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవ పర్యాయం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని, భద్రాచలం నియోజకవర్గం గెలిపించుకొని ముఖ్యమంత్రి, కి భద్రాచలం రాముడికి కానుకగా సమర్పిద్దామని ఈ సందర్భంగా ఓటర్లకు ఉత్సాహపరుస్తూ కారు గుర్తుకే మన ఓటు జై బి ఆర్ ఎస్ జై జై టిఆర్ఎస్ అంటూ నినాదాలతో గ్రామీణ ప్రాంతాలు మారుమోగు తున్నాయి. ఈ సందర్భంగా అనేకమంది ఓటర్లు వీధి సమావేశాలు, కార్నర్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జిందాబాద్ కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేస్తూ, ఇంటింటి ప్రచార కార్యక్రమాలుతో పాల్గొన్న నాయకులకు కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ అభినందనలు తెలిపారు. మండలంలో బోదాపురం పంచాయనతీలో సర్పంచ్ సోడి రాధా ఆధ్వర్యంలో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు గెలుపు కోసం విస్తృత ప్రచారం జరుగుతున్నది. కారు గుర్తుకు ఓటు వేసి తెల్లం వెంకటరావు గారిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ నాయకులు సుంకర చంటి నాయుడు, సోడి సారయ్య, తెల్ల ఆనంద్ కుమార్, మడకం రమేష్ , తిరుమల్ కుమార్, మల్లయ్య తదితర కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment