ఆలస్యమైనా ప్రజల్లోకి దూసుకెళ్తున్న ములుగు బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం ప్రతినిధి : బిజెపి అధిష్టానం ములుగు నియోజకవర్గ అభ్యర్థి గా దివంగత నేత మాజీ మంత్రి అజ్మీర చందులాల్ తనయుడు ములుగు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ అజ్మీర ప్రహ్లాదను ఆలస్యంగా ప్రకటించినా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సోమవారం మంగపేట మండలంలో ప్రచారంలో పాల్గొన్న ఆయనకు పూలమాలలతో స్థానికులు బ్రహ్మరథం పట్టారు మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వివిధ పార్టీల నేతలకు,ప్రహ్లాద్ కమలం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వమేనని బిజెపితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని,ములుగులో బిజెపి కచ్చితంగా గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు.డిసెంబర్ 30వ తారీఖున కమలం గుర్తుకు ఓటు వేసి బిజెపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.