ఆదివాసి హక్కుల పరిరక్షణకు పాటుపడే నాయకున్ని ఎన్నుకుందాం.
– పీసామొబలైజర్స్ సమావేశం తీర్మానం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం నియోజకవర్గం లోని ఐదవ షెడ్యూల్ తోపాటు గిరిజన సంక్షేమ చట్టాలు అమల్లో ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో గిరిజనుల హక్కులను పరిరక్షించి, రాజ్యాంగ బద్ధంగా,అమల్లో వున్న ఆదివాసి హక్కులకు భంగం కలగకుండా న్యాయం చేసే నేతలను అసెంబ్లీకి పంపిద్దామని, ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల పీసా మొబలైజర్స్ శనివారం సాయంత్రం వెంకటాపురం మండల కేంద్రంలో సమావేశమై తీర్మా నించారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సంక్షేమ చట్టాలు, అమల్లో ఉన్న చట్టాలను అమలు పరిచే ప్రభుత్వాలు, అధికారులు అవినీతి కారణంగా గిరిజనులు నష్టపోతున్నారని, ప్రస్తుతం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసిలంతా ఐక్యంగా ఉండి, నీతి నిజాయితీలతో తమ ఓటు హక్కును వినియోగించు కుందామని అన్నారు ఆది వాసి హక్కుల పరిరక్షణకు పాటుపడే నాయకులకు ఓట్లు వేసి గెలిపించుకుందామని, ఈ సందర్భంగా పీసా మోబలైజర్ ల సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించి ఆదివాసీలకు విజ్ఞప్తి చేసింది. చట్టసభల్లో ఆదివాసి హక్కుల కోసం ప్రభుత్వంతో కొట్లాడి, 1/70, గిరిజన చట్టాలు అమలు చేసే విధంగా నేతను ఎన్నుకుందామని ఈ సందర్భంగా పీసా మొబలైజర్ లు ఏకగ్రీవంగా తీర్మానించి వివిధ గిరిజన సంఘాలకు, ఆదివాసీలకు పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు. వివిధ రాజకీయ పార్టీలు ఓట్ల కోసం గ్రామాల్లో పర్యటించి మోసపూరిత వాగ్దానాలు చేస్తారని ఓటర్లను కొనుగోలు చేసేందుకు డబ్బు సంచులు, మద్యాన్ని ఖర్చుపెట్టి గెలిచిన తర్వాత పట్టించు కోరని విమర్శించారు. ఎన్నికలు అయిన తర్వాత పట్టించుకోరని, గ్రామాల్లో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని అర్హులైన ఆదివా సీ లందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, భూమిలేని పేద ఆదివాసు లకు గిరిజన భూమి కొనుగోలు పథకం కింద ప్రభుత్వం, భూముల ను కొనుగోలు చేసి పంపిణీ చేయాలని ,ఈ సందర్భంగ పీసా మోబ లైజర్స్ సమావేశం తీర్మానించింది. మరో ఐదు రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఆదివాసి తమ ఓటు హక్కును నిర్భయంగా, నిజా యితీగా వినియోగించుకొని,ఆదివాసి హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని ఈ సందర్భంగా తీర్మా నించింది. వెంకటాపురం మండలంలోని 18 గ్రామపంచాయతీ ల పీసా మొబిలైజర్స్ సమావేశంలో పాల్గొ న్నారు.జరగబోయే శాసన సభ ఎన్నికలలో ప్రజలు మద్యం కు డబ్బుకు ఆశపడకుండా మంచి దమ్మున్న నాయకున్ని ఎన్నుకోవాల్సిందిగా గెలుపొందిన నాయకు డు, మన ఆదివాసి చట్టాలు,హక్కులను నిర్వీర్యం చేయకుండా మన ప్రాంతంలో పీసా చట్టాలను ,హక్కులు పటిష్టంగా అమలు చేయాల ని అన్నారు.ఇట్టి సమావేశంలో వెంకటాపురం వాజేడు మండలాల పీసా మొబిలైజర్స్ పాల్గొనడం జరిగింది.
1 thought on “ఆదివాసి హక్కుల పరిరక్షణకు పాటుపడే నాయకున్ని ఎన్నుకుందాం. ”