ఆదరించండి అండగా ఉంటా : ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి
తెలంగాణ జ్యోతి,ఏటూరునాగారం ప్రతినిధి : మంగపేట మండలంలో ములుగు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి శుక్రవారం ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా రాజుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్ఎంపి డాక్టర్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ గ్రామాలలో అర్ఎంపీ ల సేవ మరువలేనిది అని,అత్యవసర పరిస్థితుల్లో గ్రామ ప్రజలకు ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కోల్పోకుండా కాపాడటానికి ప్రయత్నిస్తారని కొనియాడారు.తనను ఆడబిడ్డగా ఆదరించి కారు గుర్తుకు ఓటువేసి బిఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.తన వంతుగా ఆర్ఎంపీ డాక్టర్లకు సహాయ సహకారాలు అందిస్తానని,మీ అందరికి అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ,జడ్పీ కో అప్షన్ మెంబర్ వలియాబి,మాజీ జెడ్పిటిసి సిద్ధం శెట్టి వైకుంఠం, ఆర్ఎంపీ ల అధ్యక్షుడు శ్రీనివాస్,సర్పంచ్ లు, వార్డు సభ్యులు,సీనియర్ నాయకులు,ఆర్ ఎంపీ లు తదితరులు పాల్గొన్నారు.