అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మాణం.
- అడ్డుకున్న నూగూరు గ్రామస్తులు
- సెల్ టవర్ నిర్మించవద్దని గ్రామసభలో తీర్మానం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు పంచాయతీ గ్రామంలో, గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మిస్తున్న ప్రైవేటు నెట్వర్క్ సంస్థ నిర్మాణ పనులను గురువారం గ్రామ ఆదివాసీలు నిలుపుదల చేశారు. గ్రామస్తు లందరూ నూగూరు ప్రదాన రహదారి పక్కన నిర్మిస్తున్న సెల్ టవర్ వద్దకు చేరుకొని నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ ఆందోళన నిర్వహించారు. అయితే తాను పర్మిషన్ తెచ్చుకున్నానని ఆపటానికి మీరెవరు అంటూ నిర్మాణ సిబ్బంది దురుసుగా మాట్లాడారని గ్రామస్తులు తెలిపారు. గ్రామ ఆదివాసీ లంతా నూగూరు పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. గ్రామసభలో తమ గ్రామంలో సెల్ టవర్ నిర్మాణం జరప వద్దంటూ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో, అత్యవసర సమావేశం గ్రామ సభ నిర్వహించారు. గ్రామసభలో సెల్ టవర్ నిర్మించ వద్దంటూ తీర్మానం చేశారు. తీర్మానం ప్రతులను సెల్ టవర్ నిర్మాణం వద్ద ఉన్న గుమస్తాలకు సూపర్వైజర్లకు అందజేసి తక్షణమే పనులు నిలిపివేయాలని గ్రామ ఆదివాసిలు పెద్ద సంఖ్యలో మహిళలు గ్రామస్తు లు కోరారు. ఎటువంటి అనుమతులు లేకుండా గతంలోనే ఒక టవ ర్ నిర్మించారని మరల దాని పక్కనే గ్రామపంచాయతీ గ్రామ సభ ఆమోదం లేకుండానే,మరో టవర్ నిర్మాణం పనులు ఎలా చేస్తారంటూ మహిళలు నిలదీశారు. అధిక రేడియేషన్ వల్ల అనారోగ్య సమస్యలు నెలకొంటున్నాయని, తక్షణమే నిర్మాణ పనులు నిలిపి వేయాలని గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గుమి కూడి నిర్మాణ పనులను అడ్డుకున్నారు. నూగూరు గ్రామపంచాయతీ సర్పంచ్ ఇండ్ల లలిత,అధ్యక్షతన జి.పి.సమావేశం నిర్వహించారు. సర్ఫంచ్ ,ఉపసర్పంచ్ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు నిర్మాణ పనుల వద్ద కు చేరుకొని తీర్మానం ప్రతులను సూపర్వైజర్లకు అందజేసి తక్షణమే పనులు నిలిపివేయాలని కోరారు. స్థలం యజమాని డబ్బులుకు కక్కుర్తి పడి జి.పి.,మరియు గ్రామ సభ ల అనుమతులు లేకుండా నిర్మాణ పనులను దగ్గర నుండి చేపిస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే టవర్ నిర్మాణం పనిలిపీ వేయాలని కోరారు. సంబంధిత తీర్మానం ప్రతులను మండల అధికారులకు, అందజేయనున్నట్లు గ్రామపంచాయతీ సర్ఫంచ్ ఇండ్లలలిత ,ఉప సర్ఫంచ్ ఇండ్ల వాణి ,కార్యదర్శి,పాలకవర్గం , గ్రామ ఆదివాసీలు తెలిపారు.
1 thought on “అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మాణం. ”