అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకం

అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకం

– సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్

– సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన తస్లీమా

మహబూబాబాద్, తెలంగాణ జ్యోతి  : సామాజిక, స్వేచ్చ, సమానత్వంతో పాటు అణగారిన వర్గాల అభ్యున్నతి, దేశంలోని భవిష్యత్తు తారలకు మార్గం చూపిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితం స్ఫూర్తి దాయకమని మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా బుధవారం మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాల యంలో వేడుకలు నిర్వహించారు,అంబేద్కర్ చిత్రపటానికి తస్లీమా పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ అధునాతన వ్యవస్థలో అందరికీ సమానమైన విద్య,ఆర్థిక,రాజకీయ సామాజిక సమానత్వాన్ని అందించిన గొప్ప మహనీయుడని, మనం సమాజంలో ఇంత స్వేచ్చగా జీవిస్తున్నామంటే ఇదంతా అంబేద్కర్ మనకిచ్చిన గొప్పవరమని తస్లీమా అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది రాజేష్, మధు, అనిత, మర్తమ్మ, రిజిస్ట్రేషన్ దారులు, తదితరులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment