యుగపురుషుడు
– వెండితెర వేలుపు ఎన్టీ రామారావు నిజంగా యుగపురుషుడే..
రాముడిగా బీముడిగా
రాక్షసరాజు రావణాసురుడిగా..
వేషమేదైనా అందులోకి అలవోకగా ఆవాహనమై అలరించిన ఎన్టీరామారావు నిజంగా యుగపురుషుడే …
శ్రీమహావిష్ణువైనా..
శ్రీ కృష్ణఅవతారమై తులాభారం తూగినా..
రాయబారం నడిపినా ..
విశ్వామిత్రుడై విప్లవం సృష్టించినా..
తెలుగుసినిమాను ఏకఛత్రాదిపదంగా ఏలిన
ఎన్టీరామారావు నిజంగా యుగపురుషుడే …
అగ్గిపిడుగా అడవిరాముడా..
వేటగాడా తోటరాముడా..
అవిటివాడి పాత్రలో ఒదిగిన అమాయకుడా..
పాత్రేధైనా.. నవరసాలు పండించడం
పండించడంలో నట విశ్వరూపమైన
ఎన్టీరామారావు నిజంగా యుగపురుషుడే …
బొబ్బిలిపులిలా గర్జించినా..
బృహన్నలగా నర్తించినా..
యమగోలలో యమున్ని ఎదిరించినా..
పాత్ర పాత్రకు వైవిద్యం ఆవిష్కరించిన
ఎన్టీరామారావు నిజంగా యుగపురుషుడే …
అది పౌరాణికపాత్ర అయినా..
జానపద వేషమైనా..
సామాజిక చిత్రమైనా..
రాజకీయ ఆధునిక సినిమా అయినా ఒదిగి ఎవరెస్టు అంత ఎదిగిన ఎన్టీ రామారావు నిజంగా యుగపురుషుడే..
ఆత్మగౌరవ నినాదం అందుకుని
తెలుగుజాతి రాజకీయ అస్తిత్వానికై పోరాడి
రాజకీయ చైతన్యం పెంచి
పార్టీ స్థాపించి ప్రభంజనం సృష్టించి
సామాన్యులు కూడా రాజకీయాల్లోకి తెచ్చి రాష్ట్రప్రజల అభిమానం చూరగొని
ప్రజల గుండెల్లో దేవుడై నిలిచిన ఎన్టీరామారావు నిజంగా యుగపురుషుడే..
✍🏼బి.ప్రభాకర్ రెడ్డి
సైన్స్ టీచర్, మహాదేవపూర్, భూపాలపల్లి 7569975383