మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
– డిఎస్పి రామ్మోహన్ రెడ్డి
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో యాంటీ డ్రగ్స్ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ కూడలి వరకు మత్తు పదార్థాలపై కలిగే నష్టాలపై వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. సెంటర్ లో మానవహారం చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండా లని, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వలన విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి అమ్మినా, విక్రయించినా ,సేవించినా వారిపై పీడియాక్ట్ కేసులు నమోదు చేస్తామని, గంజాయి సమాచారం తెలిస్తే సమాచారం ఇవ్వాలని డీఎస్పీ పేర్కోన్నారు.కాటారం సిఐ రంజిత్ రావు, ఎస్ఐ అభినవ్ , పోలీస్ సిబ్బంది, విద్యార్థులు ఈ అవగాహ న ర్యాలీలో పాల్గోన్నారు.
1 thought on “మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి”