విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
వెంకటాపురం, అక్టోబర్ 5, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎన్. నవీన్ (30) అనే యువకుడు ఆదివారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఉన్న ఫ్రిజ్ నుండి నీటి బాటిల్ తీసుకునేందుకు ప్రయత్నిస్తు న్నప్పుడు, ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆయనకు గట్టిగా షాక్ తగిలింది. ఎలుకలు ఫ్రిజ్ వైర్లను కొరకడంతో విద్యుత్ సరఫరా నేరుగా బాడీకి చేరినట్లు ప్రాథమిక సమాచారం. నవీన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు నరేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై వెంకటాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరేష్ మరణంతో పాత్రపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.