గంజాయి కేసులో యువకుడు అరెస్ట్
కాటారం, జులై 30, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న యువకుడిని అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచినట్లు భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భూపాలపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన అనపర్తి రాజేష్ (20), బస్టాండ్ సమీపంలో కూరగాయల మార్కెట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు పట్టుకుని తనిఖీ చేయగా అతని వద్ద 1300 గ్రాముల నిషేధిత గంజాయి ఉన్నట్లు సీఐ నరేష్ కుమార్ తెలిపారు. అనపర్తి రాజేష్ పై మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం (NDPS Act) ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించా మన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో భాగంగా గట్టి చర్యలు తీసుకుంటున్నామని, ఈ తరహా నేరాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని భూపాలపల్లి పట్టణ సిఐ నరేష్ కుమార్ ప్రజలకు సూచించారు .