గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్ట్
ములుగు సెప్టెంబర్4, తెలంగాణజ్యోతి : బైక్ పై గంజాయితో వెళ్తున్న యువకుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్ రావు తెలిపారు. గురువారం ములుగులోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్ పై యువకుడు అనుమానాస్పదంగా వ్యవహ రిస్తూ తారసపడ్డాడు. బైక్ ఆపి తనిఖీ చేయగా అతని వద్ద 360గ్రాముల ఎండు గంజాయి లభ్యమైనట్లు తెలిపారు. బైక్ కు నెంబర్ ప్లేట్ లేదని పేర్కొన్నారు. యువకుడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకొని మొబైల్, బైక్ సీజ్ చేసి రిమాండ్ కు తరలించామని ఎస్సై వివరించారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు వెంకటేశ్వర్ రావు, సీహెచ్ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.