కుంటుపడుతున్న ఏజెన్సీ విద్య పైన ఆందోళన
– విద్యార్థుల జీవితాలను నాశనం చేసే హక్కు అధికారులకు ఎవరిచ్చారని ఆదివాసీ సంఘాల మండిపాటు
– ఐటీడీ ప్రాజెక్ట్ అధికారి, డిడిల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్..
– 4 నెల్ల నుండీ పాఠశాలలు మూతపడితే ఏమి చేశారని ఆగ్రహం
– ఏజెన్సీ డి ఎస్సి నిర్వహించాలి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ఏటూరు నాగారం ఐటీడీ ఏ అధికారులు ఏజెన్సీ విద్యను నాశనం చేస్తున్నారని ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం వెంకటాపురం మండల కేంద్రంలోని అటవీ శాఖా విశ్రాంతి భవనం లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివాసీ సంఘాల నాయకులు అయిన ఉయిక శంకర్, పూనెం సాయి, కొర్స నర్సింహా మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏటూరు నాగారం గిరిజన సంక్షేమ శాఖా గిరిజన విద్యను భ్రష్టు పట్టి స్తోందని అన్నారు. గిరిజన ప్రాథమిక పాఠశాలలు ఉపాధ్యా యులు లేక ఒక్కోటి మూత పడుతు న్నాయన్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయుల నియమించడం లేదన్నారు. వెంకటాపురం మండలం లోని ముత్తారం, కలిపాక పాఠశాలలు ఉపాధ్యాయులు లేక మూత పడ్డాయని, విద్యా శాఖా అధికారి పైన మండిపడ్డారు. రెండు పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. గత నాలుగు నెల్లుగా ఉపాధ్యాయులను నియమించ కుండా విద్యకు దూరం చేసినారని విద్యాశాఖ అధికారి పైన ధ్వజం ఎత్తారు . ఏజెన్సీ కి పట్టిన దరిద్రం అన్నారు. గిరిజన విద్యను దిగజార్చి నట్లు తెలియజేసారు . విద్యా శాఖా అధికారి చేసిన తప్పులను ప్రాజెక్ట్ అధికారి సమర్థించడాన్ని, ఏజెఏసి తీవ్రంగా తప్పు పట్టింది. 317 జి ఓ ద్వారా వచ్చిన ఉపాధ్యాయుల కారణంగా ఏజెన్సీ విద్య మరింత పతనావస్థకు చేరువయిందన్నారు. నాణ్యమైన ఆంగ్ల విద్య దేవుడెరుగును, కనీసం నాసిరకం విద్యకు ఆదివాసీ బిడ్డలు నోచుకోవడం లేదని విమర్శించారు. ఏకోపాధ్యాయ పాఠశాలలే అధికంగా ఉన్నాయన్నారు. ఏజెన్సీ విద్య కుంట పడడానికి ప్రాజెక్ట్ అధికారి చేతగాని తనమే అన్నారు. నాగారం గిరిజన సంక్షేమ శాఖా ఆధ్వర్యంలోని 29 పాఠశాలలు మూత పడడం తో ఆదివాసీ గిరిజన బిడ్డల బ్రతుకులకు తెరపడేలా చేసింది అధికారులే అన్నారు. ఉపాధ్యాయులు కావాలని అడి గితె ప్రజా ప్రతినిధి పైన కేసు పెట్టిన నియంత అన్నారు. నియంతలు ఎప్పుడు ప్రజలకు సేవ చేయలేరన్నారు. గిరిజన విద్యా ద్రోహిగా ఆదివాసీ సంఘాలు అభివర్ణించాయి. పాఠశాల పైన ఎటువంటి పర్యవేక్షణ లేదన్నారు. కొంతమంది ఉపాధ్యా యులు సమయపాలన పాటించడం లేదని తెలిపారు. పని సమయాల్లో చరవాణి తో కాలక్షేపం చేస్తున్నారని తెలియజే సారు. ములుగు వెలుగు యాప్ ని మళ్ళీ పునరుద్దరించాలని కోరినారు. గిరిజన విద్య నాశనం అవుతున్నా జిల్లా మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు కావాలని ఆదివాసీలు ధర్నాలు చేస్తూ ఉంటే మంత్రి మౌనం దేనికి సంకేతం అని నిలదీశారు. ఆదివాసీ బిడ్డల బ్రతుకులను బలి చేసిన ప్రాజెక్ట్ అధికారి, డి.డి. ల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు… ఏజెన్సీ డి ఎస్సి నిర్వహించాలన్నారు. సి ఆర్ టి నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేయాలన్నారు. పతనం అవుతున్న ఏజెన్సీ విద్య పైన, జాతీయ ఎస్టీ కమిషన్ కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు… ఏజెన్సీ విద్య బలోపేతం కొరకు ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏటూరునాగారం ఐటీడీ ఏ ను వేలమంది తో ముట్టడిస్తామని హెచ్చరించారు..జి ఎస్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్, ఏ ఎన్ ఎస్ మండల ఉపాధ్యక్షులు కుంజ మహేష్ తదితరులు పాల్గొన్నారు..