అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం
ఏటూరునాగారం, జూలై 11, తెలంగాణ జ్యోతి : ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటూరునాగారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంబేద్కర్ యువజన సంఘం, మేర యువ భారత్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బాదావత్ అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశ వనరులు సరిపడేలా వినియోగించాలంటే జనాభా నియంత్రణ అత్యవస రమని, జనాభా పెరుగుదల కారణంగా ఉద్యోగ అవకాశాలు తగ్గి పోతున్నాయన్నారు. వనరుల కొరత, పర్యావరణ సమస్యలు, నేరాల రేటు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయాలు గా పేర్కొన్నారు. కేవలం కుటుంబ ప్రయోజనం కోసమే కాక, సమాజ భవిష్యత్ కోసమూ ఫ్యామిలీ ప్లానింగ్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రిన్సిపాల్ అశోక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మామిడి శంకర్, బిక్షపతి రాజు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రవిచంద్ర, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కిషోర్ కుమార్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.