ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ డే  అవగాహన ర్యాలీ

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ డే  అవగాహన ర్యాలీ

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ప్రభుత్వ డిగ్రీ కళాశా ల ఏటూరునాగారం నందు ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అధ్యాప కులు, విద్యార్థులు  ఎయిడ్స్ డే అవగాహన ర్యాలీ నిర్వహిం చారు.  ఈ  ర్యాలీని కళాశాల ప్రిన్సిపల్ బి. రేణుక ప్రారంభిం చగా ఎన్ఎస్ఎస్ సంథాన కర్త సిహెచ్ వెంకటయ్య మాట్లాడు తూ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఎయిడ్స్ మహమ్మారిని మానవ సమాజం నుండి పారద్రోలాలంటే యువత కీలక పాత్ర పోషించాలని, ఎయిడ్స్ రోగాన్ని ద్వేషించాలి కానీ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను కాదని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించా రు. ఈ ర్యాలీలో అధ్యాపకులు నవీన్, జ్యోతి, ఫాతిమా, సంపత్, రమేష్, జీవవేణి, శేఖర్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment