గ్రామపంచాయతీలకు ఈసారైనా ఎన్నికలు జరిగేనా..?

గ్రామపంచాయతీలకు ఈసారైనా ఎన్నికలు జరిగేనా..?

గ్రామపంచాయతీలకు ఈసారైనా ఎన్నికలు జరిగేనా..?

– రెండేళ్లుగా అధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాలన

– బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్

– గ్రామాల్లో చిగురుతున్న ఆశలు

వరంగల్, ఆగస్టు 29,తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీల కాలపరిమితి పూర్తై రెండేళ్లు దాటినా, ఇంకా ఎన్నికలు జరగకపోవడంతో ఆశావా హుల్లో నిరాశ నెలకొంది. 2023 డిసెంబరులో జరగాల్సిన ఎన్నికలు అసెంబ్లీ పోలింగ్ కారణంగా వాయిదా పడ్డాయి. అనంతరం పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మరింత ఆలస్యం జరిగింది. హైకోర్టు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు జరపాలని ఆదేశించడంతో ప్రభుత్వం కదలికలు ప్రారంభించింది. ఈ క్రమంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 1,702 గ్రామపంచాయతీలు, 775 ఎంపీటీసీ, 75 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో సుమారు 700 పంచాయతీలు, 325 ఎంపీటీసీ స్థానాలు బీసీలకు దక్కే అవకాశముంది. దీంతో రాజకీయ కసర త్తులు వేగం పుంజుకున్నాయి. ఎన్నికల్లో తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఎమ్మెల్యేలతోపాటు జిల్లా నాయకులు ముమ్మరంగా రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి గెలుపు సాధించాలని ప్రణాళిక వేస్తోంది. మరోవైపు బీజేపీ, బీఆర్‌ఎస్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పంచాయతీ ఎన్నికల్లో బలం పెంచుకోవాలని కసరత్తులు చేస్తున్నారు. ఏది ఏమైనా, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వెలువడే వరకు గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఉత్కంఠ రేపనుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment