అక్రమ తవ్వకాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు..?
– అధికారి అండదండలతో అక్రమ మట్టి రవాణా!
– ఆర్ ఐ తనిఖీలు తూతూ మాత్రమేనా..!
కన్నాయిగూడెం, తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా కన్నా యిగూడెం మండలం ఏటూర్ గ్రామ పరిధిలో సెలవు దినం ఆదివారం పగలు రాత్రి అనే తేడా లేకుండా అధికారి అండ దండలతో అక్రమంగా మట్టి రవాణా తరలించారు. ఎవరైనా అడుగుతే ఆర్ఐ గణేష్ పై నెటేస్తూ చేతులు దులుపుకొ న్నారు. అక్రమంగా మట్టి రవాణా నిర్వహించేవాళ్ళు మంత్రి అనుచరులు కావడం, వీరిపై కఠిన చర్యలకు అదేశించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై స్థానిక ఎమ్మార్వో చారవాణిలో వివరణ కోరగా… ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆర్ఐని ఫోన్ సంప్రదించగా ఎక్కడ మట్టి తరలుస్తున్నారు. అక్కడవి ఫోటోలు పెట్టండి అని చెప్పారు. సోమవారం రాత్రి సమయంలో కూడా మట్టి తరలిస్తుంటే ఓ విలేఖరి, ఎమ్మార్వోను ఫోన్ లో వివరణ కోరగా… మట్టి తవ్వకాలకు కానీ, గ్రావెల్ తవ్వడానికి కానీ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. రాత్రయితే రెవెన్యూ అధికారులు రారని, ఒకవేళ వచ్చినా తప్పించునే అవకాశం ఉంటుంది కనుక రాత్రులు పెట్టుకోమని చెప్పారని పలు గ్రామాల్లో ప్రజలు బహిరంగంగానే చర్చించుకుం టున్నారు. అక్రమ మట్టి రవాణాకు సహకరించిన రాజకీయ నాయకుల అనుచరులను దూరంగా ఉంచకపోతే నిజాయితీ పరులైన వారికి పేరుకు తూట్లు పడే అవకాశం ఉందని సొంత పార్టీ వారే గుసగుసలాడుకుంటున్నారు.
ఆర్ఐ తనిఖీలు తూతూ మాత్రమేనా..?
కన్నాయిగూడెం మండల ఏటూర్ గ్రామంలో గోదావరి అను కోని అక్రమ మట్టి రవాణ తరలిస్తున్నారని తెలంగాణ జ్యోతి పత్రికలో ప్రచురించడమైనదని అందరికి తెలిసిందే…ఈ సందర్భంగా సోమవారం ఆర్ఐ గణేష్ సంఘటన స్థలానికి చేరుకుని తూతు మంత్రంగా తనిఖీలు నిర్వహించారని, ఘట న స్థలంలో పోజులకే ఫోటోలు దిగారని స్థానిక గ్రామస్థులు ఆరోపించారు. సరిగ్గా పరిశీలించినట్టయితే అనుమతులు ఉ న్నాయో, లేవో తెలిసేదని ప్రజలు గుసగుస లాడుతున్నారు.