ఇందిరమ్మ ఇండ్ల విషయంలో జాప్యం ఎందుకు.. ? 

ఇందిరమ్మ ఇండ్ల విషయంలో జాప్యం ఎందుకు.. ? 

ఇందిరమ్మ ఇండ్ల విషయంలో జాప్యం ఎందుకు.. ? 

– బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్

మహాదేవపూర్,జూన్24, తెలంగాణ జ్యోతి: మహాదేవపూర్ మండలం లో ఇందిరమ్మ ఇండ్లను కేటాయించిన జాబితా ఎక్కడ అని బీజేపీ మండల అధ్యక్షులు ఒక ప్రకటన లో ప్రశ్నించారు. పక్క నియోజకవర్గం లో కేవలం ఎమ్మెల్యే గా ఉన్న వారే వారి నియోజకవర్గల్లో ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శర వేగంగా జరుగుతుంటే మంథని నియోజకవర్గం లో ఐటి మినిస్టర్ ఉన్న కూడా కనీసం ఇందిరమ్మ ఇండ్ల ఆమోదం జాబితా రాకపోవడం సిగ్గు చేటనీ విమర్శించారు. మహాదేవపూర్ మండలానికి 321 కేటాయించారని, అందులో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంచుకున్న ఎలకేశ్వరం గ్రామంలో 56 ఇండ్లు ఇస్తే ఇప్పటికి అక్కడ కేవలం 30 మందికి మాత్రమే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారని పేర్కొన్నారు. మరి మిగిలిన ఇందిరమ్మ ఇండ్లను ఎందుకు ఆపుతున్నారో మంత్రి స్పందించాలనీ డిమాండ్ చేశారు. మహాదేవపూర్ గ్రామానికి 120 ఇల్లు ఇచ్చామని చెప్తున్నా.. ఇస్తే ఎవరికి ఇచ్చారు ? ఆ జాబితా ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. మహాదేవపూర్ మండల ప్రజలు అంటే ఎందుకు మీకు ఇంత చిన్న చూపు, ఇక్కడి ప్రజలు మీకు ఓట్లు వేయలేదా అని మంత్రిని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయమై ఎం పీ డీ ఓ ని వివరణ కోరగా ఇందిరమ్మ కమిటీ లిస్ట్ ఫైనల్ చేసి మంత్రి కి పంపారని , వారి దగ్గరి నుండి మాకు ఇంకా ఫైనల్ లిస్ట్ రాలేదని అధికారులు చెబుతున్నారని వారు పేర్కొన్నారు. ఇండ్ల విషయం లో ఎందుకు జాప్యం వహిస్తున్నారో మంత్రి స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున, ఇండ్ల లిస్ట్ ను ప్రకటించకుండా ఆపుతున్నారా ? అని ప్రశ్నించారు. మంత్రి వెంటనే స్పందించి మహాదేవపూర్ మండలానికి కేటాయించిన 321 ఇండ్లకు గాను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎలకేశ్వరం గ్రామానికి మంజూరు చేసిన 56 ఇండ్లు పోగా మిగిలిన 265 ఇందిరమ్మ ఇండ్ల జాబితా వెంటనే ప్రకటించి, అర్హులైన వారికీ ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వాలని బీజేపీ మహాదేవపూర్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేని యెడల అర్హులైన వారితో కలిసి మండల బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ సాగర్ల రవీందర్, లింగంపెల్లి వంశీ, కొక్కు శ్రీనివాస్, దడిగేల వెంకటేష్ లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment