6 గ్యారంటీల హామీ ఏమాయే..?
– నిరసనలు, రాస్తారోకోలతో .. బీఆర్ఎస్ నేతల నిలదీత..
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ఎన్నికల ముందు ఆరు గారంటీల హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు తీరును మరిచి అడ్డగోలుగా వ్యవహ రిస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రమైన గారేపల్లి లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు, మంథని నియో జకవర్గం ఇన్చార్జి పుట్ట మధు ఆదేశాల మేరకు కాటారం మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా కార్యక్రమం నిర్వహిం చినట్లు మండల బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి జోడు శ్రీనివాస్ తెలిపారు. రైతు భరోసా, రైతు బంధు అమలు, తీరుకో మాట, రేవంత్ రెడ్డి సర్కారు బాట అని బీఆర్ఎస్ నేతలు అన్నారు. రైతు భరోసా ఇవ్వనందుకు నిరసనగా రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి పది నెలలు గడిచిన ఇప్పటివరకు ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో హామీ ప్రకారంగా ఆరు గ్యారెంటీలను నేటికీ అమలు చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి , అసమర్థతకు నిదర్శనమని వారు అన్నారు. హైదరాబాద్ తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, ఇచ్చిన హామీలను పక్కదారి పట్టిస్తూ హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతున్నారని విమర్శించారు.ఈకార్యక్రమంలో కాటారం బీఆర్ఎస్ నాయకు లు కాటారం మండల ఇంచార్జ్ జోడు శ్రీనివాస్, మండల ఉపా ధ్యక్షులు ఊర వెంకటేశ్వరరావు, మందల లక్ష్మారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు రామిల్ల కిరణ్, మంథని నియోజకవర్గ ఎస్ సి సెల్ అధ్యక్షుడు పంతకాని సడువలి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొండ గొర్ల వెంకటస్వామి, జక్కు శ్రావణ్, ఆత్కూరి బాలరాజు, తైనేని సతీష్, టౌన్ అధ్యక్షులు ఉప్పు సంతోష్, నిట్టూరు శేఖర్, మహిళా నాయకురాల్లు మమత, మంతెన అర్చన, నాగమణి. గాలి సడవలి, వంగల రాజేంద్ర చారి, జాగిరి మహేష్, దేవరాంపల్లి మనోహర్, చింతకాని చక్రి గౌడ్, పొట్ట బానయ్య, మాదాసు ముండి, శేఖర్ రెడ్డి, జాడి శ్రీశైలం, గూడూరు రమేష్, కొండపర్తి రమేష్, మానెం రాజ బాబు పైడాకుల మహేందర్, పున్నం సతీష్, గడిపల్లి రవి, జిమూడ వంశీ తదితరులు పాల్గొన్నారు.