సంక్షేమ పథకాల అమలు క్లస్టర్ అధికారులు
కాటారం, జూలై 29, తెలంగాణ జ్యోతి : జిల్లాలో జరిగే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలు, ప్రజాసేవల అమలుపై సమగ్ర పర్యవేక్షణకు క్లస్టర్ అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలాల్లో ప్రభుత్వ సేవల అమలు, రెగ్యులేటరీ చర్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై పటిష్ట మైన పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు జిల్లాలో క్లస్టర్ అధికారులు నియమించారు. కాటారం, మలహార్ర్ రావు, మహాముత్తారం మండలాలకు కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, మహాదేవపూర్ పలిమెల మండలాలకు డిఎఫ్ఓ నవీన్ రెడ్డి, భూపాలపల్లి, ఘనపూర్ మండలాలకు జేసీ కె అశోక్ కుమార్, కొత్తపల్లిగోరి, రేగొండ, చిట్యాల మండలాలకు జేసి విజయలక్ష్మి, మొగుళ్ల పెళ్లి, టేకుమట్ల మండలాలకు భూపాలపల్లి ఆర్డీవో ఎం రవి లను జిల్లా కలెక్టర్ నియమించారు. క్లస్టర్ అధికారులు మండల ప్రత్యేక అధికారులతో సమన్వయంతో పనిచేసి, అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సి ఉంటుందని ఆయన పేర్కొ న్నారు. అధికారులను సమన్వయం చేస్తూ పనిచేసి మండలా లలో అన్ని ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని సూచించారు.