ప్రజల భాగస్వామ్యంతో పాలన కొనసాగిస్తాం

Written by telangana jyothi

Published on:

ప్రజల భాగస్వామ్యంతో పాలన కొనసాగిస్తాం

 – ఎంపీపీ పంతకాని సమ్మయ్య 

తెలంగాణ జ్యోతి/ కాటారం ప్రతినిధి: ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ద్వారా ప్రజా పాలన కొనసాగిస్తామని కాటారం మండల పరిషత్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని శంకరం పల్లి, విలాసాగర్ తదితర గ్రామాలలో జరిగిన ప్రజాపాలన  కార్యక్ర మంలో పాల్గొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.రాబోయే రోజుల్లో భవిష్య త్తు తరాలకు ఉపయోగపడే విధంగా దీర్ఘకాలిక ప్రయోజనాలతో అభివృద్ధి, సంక్షేమం చేపట్టనున్నట్లు సమ్మయ్య తెలిపారు. ఆయా కార్యక్రమాలలో కాటారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి మాలోతు శంకర్ , శంకరంపల్లి సర్పంచ్ అంగజాల అశోక్ కుమార్, వ్యవసాయ అధికారి రామకృష్ణ, ఏపీఏం లవకుమార్, పంచాయతి సెక్రటరీ శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొనగా మండల ప్రత్యేక అధికారి సంజీవరావు పర్యవేక్షించారు.

Tj news

1 thought on “ప్రజల భాగస్వామ్యంతో పాలన కొనసాగిస్తాం”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now