రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అహర్నిశలు కృషి చేయాలి
– జై బాపు , జై భీమ్, జై సంవిధాన్ ప్రతిజ్ఞ
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : భారత రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైన గొప్ప రాజ్యాంగంగా కాపాడు కోవడానికి చిత్తశుద్ధితో, అంకితభావంతో, అహర్నిశలు కృషి చేయాలని పలువురు కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రం నేలారిపేట దళిత వీధిలో జై బాపు, జై భీమ్ సంవిధాన్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులందరూ సమావేశమై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ముక్తకంఠంతో నిర్వహించారు. భారతీయులమైన మనమంతా మన రాజ్యాంగాన్ని కాపాడు కోవాలని, శాంతి అహింసలను, మూల సూత్రాలుగా బోధించిన, గాంధీ మహాత్ముడిని స్ఫూర్తిగా మనమంతా ఒకటే అంటూ, రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, ఈ సందర్భంగా వెంకటాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ పిలుపునిచ్చారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులు అంటూ నినాదాలు అనే నినాదాలతో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, నూగూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సాధన పెళ్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గారపాటి రవి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీరాములు రమేష్, పిల్లారి శెట్టి మురళి నాయుడు, దళిత సంఘాల నాయకులు మంచాల భూషణం, గుండమళ్ళ కిరణ్, యన్నమళ్ళ రమణయ్య, పలువురు కార్యకర్తలు, నాయకులు మహిళా సోదరీమణులు పెద్ద సంఖ్యలో ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు.