బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలి

బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలి

బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలి

– సింగరేణి డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు

కాటారం, అక్టోబర్ 14, తెలంగాణ జ్యోతి : సింగరేణిలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు కార్మికులు ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సింగరేణి డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు అన్నారు. సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ C&MD ఆధ్వర్యంలో OBR కాంట్రాక్టర్లు మరియు డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో డైరెక్టర్ (PP) కె. వెంకటేశ్వర్లు భూపాలపల్లి ఏరియా నుండి పాల్గొన్నారు. భూపాలపల్లి ఏరియాలో మంగళవారం డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు KTK OC-2 & OC-3 ప్రాజెక్ట్‌ను సందర్శించారు. సందర్శన సందర్భంగా ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితులు, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ఎదురవుతున్న సవాళ్లను ఆయన వివరంగా సమీక్షించారు. వర్షాల కారణంగా గనిలో నిల్వవున్న నీటిని తక్షణమే తొలగించి ఉత్పత్తి కార్యకలాపాలను వేగంగా పునరుద్ధరించాలం టూ సూచించారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, సమర్థ వంతమైన ఉత్పత్తి కొనసాగింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కె. వెంకటేశ్వర్లూ భూపాలపల్లి ఏరియాలోని విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళికలు, బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, మరియు మిషినరీ సదుపాయాలపై సమీక్ష చేపట్టారు. యంత్ర పరికరాలు, ఎలక్ట్రికల్ మెషినరీ, సర్వీస్ మరియు మైనింగ్ పరికరాల వినియోగం, నిర్వహణ అంశాలపై చర్చించి, అవసరమైన సాంకేతిక అభివృద్ధి చర్యలపై పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతీ ఏరియా మరియు ప్రాజెక్ట్ స్థాయిలో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి అందరూ సమన్వయంతో పని చేయాలి.  భద్రతతో కూడిన ఉత్పత్తి సంస్థ అభివృద్ధికి మూలస్తంభం. ప్రతి ఒక్కరి సమష్టి కృషితోనే సింగరేణి మరింత ముందుకు సాగుతుందని అన్నారు. సాంకేతిక ఆధునీకరణ, సమర్థవంతమైన మానవ వనరుల వినియోగం, మరియు యంత్రపరికరాల సద్వినియోగం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం అత్యవసరమని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ A. రాజేశ్వర్ రెడ్డి , ప్రాజెక్ట్ అధికారి శ్యామ్ సుందర్ , మేనేజర్ శ్రామకాంత్,CMOAI అధ్యక్షుడు నజీర్ అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment