నేటి తరానికి ప్రాచీన కలలను అందించాలి 

నేటి తరానికి ప్రాచీన కలలను అందించాలి 

నేటి తరానికి ప్రాచీన కలలను అందించాలి 

– శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీను బాబు

కాటారం, తెలంగాణ జ్యోతి : ఆధునిక సమాజంలో చిరుతల రామాయణం లాంటి ప్రాచీన కళలు ప్రజలకు, నేటి యువత కు అందించడం, కళాకారుల కు తమ ప్రోత్సాహం ఉంటుందని శ్రీపాద ట్రస్ట్ చైర్మెన్ దుద్దిల్ల శ్రీను బాబు అన్నారు. గారెపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చిరుతల రామాయణం శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువకులు రామాయణంలో పాత్రలు ధరించి ఆదర్శంగా నిలు వడం పట్ల అభినందించారు. రెండు నెలల గా సుమారు 30 మంది కళాకారులు చిరుతల రామాయణం ప్రదర్శన నిర్వహిం చేందుకు నేర్చుకున్నారు. రామాయణం పాత్రల కు కోచింగ్ ఇచ్చిన గురువు కొత్తపెళ్ళి రాజయ్య ను అభినందించి శాలువా తో సన్మానం చేశారు. చిరుతల రామాయణం పాత్రదారులను, సహకరించిన దాతల ను శాలువా తో చిరుతల రామాయణం కమిటీ ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి మండలం లోని వివధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment