మహాత్మ జ్యోతిరావుపూలే ఆశయ సాధనకై అందరం కృషి చేయాలి
కమిటీ చైర్మన్ జనగామ కరుణాకర్ రావు
కాటారం, ఏప్రిల్ 11,తెలంగాణ జ్యోతి : కాటారం మండల కేంద్రంలో మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ జనగామ కరుణాకర్ రావు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కరుణాకర్ రావు మాట్లాడుతూ భారతదేశంలో కుల వివక్ష, అంటరానితనం నిర్మూలన మరియు మహిళా విద్య కోసం పోరాడిన గొప్ప సామాజిక సంస్కర్త. ఆయన, తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారు. సమానత్వం, హేతువాదం కోసం ‘సత్యశోధక్ సమాజ్’ను స్థాపించిన పూలే, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషికి గాను ‘మహాత్మా’ బిరుదు పొందారు అని ఈ సందర్బంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు మరియు కుల మతాలకు అతీతంగా నాయకులు, మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









