మేము ఎంతో మాకు అంత వాటా దక్కాలి
– ప్రాణాలు ఉన్నంతవరకు జాతి కోసం మాట్లాడుతా
– మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పిడమర్తి రవి
ములుగు, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ జేఏసీ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముందుగా బాబాసాహెబ్ అంబే ద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా మాదిగ జేఏసీ వ్యవస్థా పకులు నేతాజీ డా,, పిడమర్తి రవి పాల్గొని మాట్లాడుతూ.. ప్రాణం ఉన్నంతవరకు మాదిగ జాతి హక్కుల కోసం పోరాడుతా అన్నారు. మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ సాధనే అంతిమ లక్ష్యంగా రాష్ట్రంలో మాదిగలకు చుక్కానై నిలబడతానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ సమ్మెళ నాలు నిర్వహిస్తూ మాదిగ జాతి బిడ్డలను ఏకం చేస్తున్నా మని. రాజ్యాంగ బద్ధంగా మాకు రావాల్సిన వాటా దక్కేవరకు ఉద్యమిస్తామన్నారు. కేంద్రం లోని పాలకులు మాదిగలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలు బిజెపి పార్టీ కి తగిన బుద్ది చెపుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ ములుగు జిల్లా అధ్యక్షులు అంబాల మురళి, ములుగు అసెంబ్లీ ఇన్చార్జ్ యాసం రమేష్, కన్నాయి గూడెం, వెంకటాపురం, గోవిందరావుపేట, మండల అధ్యక్షులు చిట్యాల నరేష్, తోకల అంజి, రాకేష్, లతో పాటు జిల్లా యువజన విభాగం నాయకులు గజ్జల నవీన్, రాంబాబు, చిట్యాల నవీన్, జెమిని, బాలాజీ, సాగర్, మహేష్, సంతోష్, కార్తీక్, గౌతమ్, తేజ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.