ప్రీమియర్ లీగ్–2 కప్ కైవసం చేసుకున్న వారియర్స్ టీం

ప్రీమియర్ లీగ్–2 కప్ కైవసం చేసుకున్న వారియర్స్ టీం

ప్రీమియర్ లీగ్–2 కప్ కైవసం చేసుకున్న వారియర్స్ టీం

వెంకటాపురం, అక్టోబర్ 12, తెలంగాణ జ్యోతి :  ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో అట్టహాసంగా నిర్వహించిన వెంకటాపురం ప్రీమియర్ లీగ్–2 క్రికెట్ పోటీలలో హంటర్ వారియర్స్ జట్టు అద్భుత ప్రతిభ కనబరచి విజేతగా నిలిచి కప్‌ను కైవసం చేసుకుంది. రెండో స్థానాన్ని మహాలక్ష్మి టీం, మూడో స్థానాన్ని టీచర్స్ వారియర్స్, నాలుగో స్థానాన్ని మరో స్థానిక జట్టు సాధించాయి. గత నెల 22వ తేదీన స్థానిక కాఫీడు మైదానంలో ప్రారంభమైన ఈ పోటీలు భారీ వర్షాలు, తుఫానుల కారణంగా కొంతకాలం నిలిచిపోయినా, ఆదివారం జరిగిన మెగా ఫైనల్‌తో ఘనంగా ముగిశాయి. ఫైనల్ పోటీలో హంటర్ వారియర్స్ జట్టు ప్రతిభ కనబరచి ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజేత జట్టుకు ₹55,555 నగదు బహుమతిని ప్రముఖ వ్యాపారవేత్త, రైతు కీర్తిశేషులు బాలసాని ముత్తయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు వేణుగోపాల్, అశ్వపతి, రవికుమార్ లు స్పాన్సర్ చేశారు. రెండో బహుమతిగా మహాలక్ష్మి టీంకు ₹33,333 నగదు బహుమతిని కీర్తిశేషులు గోడవర్తి శ్రీమన్నారాయణ జ్ఞాపకార్థం వారి కుమారుడు గోడవర్తి నరసింహమూర్తి అందించారు. మూడవ బహుమతిగా టీచర్స్ వారియర్స్ టీంకు ₹22,222 నగదు బహుమతిని పీర్ల కృష్ణబాబు, ఆగ్రోస్ శ్రీనాథ్ లు స్పాన్సర్ చేయగా, నాలుగవ బహుమతిగా ₹11,111 రూపాయలను వ్యాపారవేత్తలు డర్రా దామోదర్, చిట్టెం శ్రీనివాస్ లు అందజేశారు. కాఫీడు మైదానంలో శాశ్వత క్రీడా వేదికను నిర్మించిన బేతంచెర్ల వెంకటేశ్వర్లు–లక్ష్మి దంపతులు క్రీడాభిమానుల ప్రశంసలు పొందారు. ఆదివారం జరిగిన మెగా ఫైనల్‌ను తిలకించేందుకు వందలాది మంది అభిమానులు తరలి రావడంతో మైదానం కిక్కిరిసిపోయింది. బహుమతుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథులుగా వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్, ఎస్సై కె. తిరుపతిరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పిఎసిఎస్ అధ్యక్షులు చిడెం మోహన్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, బహుమతి దాతలు గోడవర్తి నరసింహమూర్తి, పీర్ల కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. విజేతలకు నగదు బహుమతులు, షీల్డులు అందజేసిన అనంతరం నిర్వాహకులు మరియు దాతలకు పట్టు శాలువాలతో సత్కారం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వెంకటాపురం ప్రీమియర్ లీగ్ (VPL) నిర్వాహకులు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment