పోస్ట్ కార్డులతో ఓట్ ఫర్ సూర్ వినూత్న ప్రచారం
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో గల స్వయం కృషి స్వచ్ఛంద సేవా సంస్థ వినూత్న రీతిలో ఓట్ ఫర్ సూర్ ( VOTE FOR SURE) కార్యక్రమాన్ని చేపట్టింది. ఓటు హక్కు అనేది మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన ఒక గొప్ప వరం, పోలింగ్ డే ఒక పవిత్రమైన ప్రజాస్వామ్య పండగ రోజు అని, ఆ పండగ రోజును హాలిడే గా భావించకుండా, ఓటు హక్కు ను కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా మే 13న తమ ఓటును వేయాలని పోస్టు కార్డులతో ప్రజలందరిలో చైతన్యవంతమైన ఆలోచన భావనను ఏర్పరచారు. ఈ కార్యక్రమాన్ని కాటారం సబ్ డివిజన్ డిఎస్పి జి రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాటారం ఎస్సై అభినవ్, హరి శంకర్, కొయ్యూరు ఎస్ఐ నరేష్, అడవి ముత్తారం ఎస్సై పి. మహేందర్, స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కొట్టే సతీష్ తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు కాటారం గారేపల్లి లో ప్రధాన కూడళ్లలో గల వర్తక వ్యాపారస్తులకు మరియు ప్రజలకు ఓట్ ఫర్ సూర్ ( VOTE FOR SURE) పోస్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఇలాంటి వినూత్న ఆలోచన కార్యక్రమాన్ని చేపట్టిన స్వయంకృషి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులను పలువురు అభినందించారు.
Azhaan Ovall
Shama Neeson