వైభవంగా ప్రారంభమైన వినాయక నవరాత్రి మహోత్సవాలు

వైభవంగా ప్రారంభమైన వినాయక నవరాత్రి మహోత్సవాలు

వైభవంగా ప్రారంభమైన వినాయక నవరాత్రి మహోత్సవాలు

వెంకటాపురం, ఆగస్టు28, తెలంగాణ జ్యోతి : శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామ గ్రామాల్లో ఉత్సవ కమిటీలు స్వామి వారి విగ్రహాలను మండపాలలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించాయి. ఇంటింటా వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఇళ్లను మామిడి తోరణాలతో అలంకరించి, ఉండ్రాళ్లు, పులిహార, పరమాన్నం వంటి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. భక్తులు నిరాజనాలు పలుకుతూ “జై బోలో గణేష్ మహరాజ్ కి జై” అంటూ నినాదాలు చేశారు. వెంకటాపురం, ఏటూరునాగారం, చర్ల ప్రాంతాల నుండి విగ్రహాలను వాహనాలపై ఊరేగింపుగా తీసుకువెళ్లి ప్రతిష్ఠించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మొదటి రోజు పూజలు వైభవంగా జరిగాయి. వెంకటాపురం–వాజేడు మండల పరిధిలోని 35 పంచాయితీ లలోనూ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, నవరాత్రి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. వేప చెట్టు యూత్ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు, వ్రతకల్ప పుస్తకాలను భక్తులకు పంపిణీ చేశారు. అంబేద్కర్ సెంటర్లో కల్వపూలు, పత్రి విక్రయాలు జోరుగా జరిగాయి. అనేక దేవాలయాల్లో భక్తులు వేకువ జామునే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment