కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విజ్ఞశ్రీ
ఏటూరునాగారం, ఫిబ్రవరి 6 తెలంగాణ జ్యోతి : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అలవాల విజ్ఞశ్రీ రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి మండలానికి గర్వకారణంగా నిలిచింది. ఈ నెల బుధవారం హైదరాబాదులో నిర్వహించిన కరాటే పోటీల్లో ఆమె ప్రతిభను చాటుకుని స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా విజ్ఞశ్రీని ఎస్సై రాజ్‌కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈఓ కోయడం మల్లయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కరాటే మాస్టర్ హుస్సేన్, వార్డు సభ్యులు రాజు, కాళ్ల రామకృష్ణ, మధు, వసంత విశాల్ తదితరులు ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.






