వెంకటాపురం వాస్తవ్యుడు కొండపర్తి నరేష్‌కు సిఐగా పదోన్నతి
– పలువురు అభినందనలు
వెంకటాపురం, ఆగస్టు2, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన కొండపర్తి నరేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రాఫిక్ విభాగంలో ఎస్.ఐ.గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో అంకితభావం, నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తూ ఆయన అధికారి మాన్యం పొందారు. ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ విభాగంలో ఆయన చూపిన సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు నరేష్‌కు సబ్‌ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సి.ఐ.) స్థాయికి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సి.ఐ.గా పదోన్నతి పొందిన యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ కొండపర్తి నరేష్‌కు బంధుమిత్రులు, వెంకటాపురం గ్రామస్తులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక యువత తదితరులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.