వెంకటాపురం మండల బంద్‌ను జయప్రదం చేయాలి – సిపిఎం
వెంకటాపురం, ఆగస్టు2, తెలంగాణ జ్యోతి : వెంకటాపురం – చర్ల భద్రాచలం రహదారి మరమ్మతులు వెంటనే ప్రారంభిం చాలని డిమాండ్ చేస్తూ 6న సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టనున్న వెంకటాపురం మండల బంద్‌ను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ ప్రజలను కోరారు. ఆలుబాక, మొర్రవానిగూడెం, సూరవీడు గ్రామాల్లో జరిగిన నిరసనల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బంద్‌కు మద్దతుగా ఆలుబాకలో మానవహారం నిర్వహిస్తామని తెలిపారు. ఇసుక లారీల కారణంగా రోడ్లు అధ్వానంగా మారాయని, వెంటనే నిధులు కేటాయించి మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర రహదారి నం.12 లోని రాళ్లవాగు బ్రిడ్జి ప్రమాద స్థితిలో ఉందని హెచ్చరించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు సిపిఎం పోరాటాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి గ్యానం వాసు, వంకా రాములు, కుమ్మరి శీను, పండా శీను, కారం వెంకట నరసయ్య, గంగిన పోయిన కిష్ట, తదితరులు పాల్గొన్నారు.