శ్రీ సాయినాధుని నామస్మరణతో మార్మోగిన వెంకటాపురం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి సాయిబాబా భక్తమండలి, భక్తబృందం ఆధ్వర్యంలో భజనా కార్యక్రమం కనుల విందుగా, శ్రవణానందంగా నామస్మరణతో మారు మోగింది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నామ స్మరణలతో శ్రీ షిరిడి సాయినాధుని పాటలతో భక్తబృందం సాయినాధుని భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ షిరిడి సాయినాధుని ఇష్టపూర్వకమైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి ప్రసాదాలను భక్తులకు పంపీణి చేశారు. ప్రతి గురువారం శ్రీ షిరిడి సాయి నాధుని మందిరంలో, మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమంతో పాటు, రాత్రి భజన కార్యక్రమం ఉంటుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ శిరిడి సాయి నాధుని భజన కార్యక్రమంలో పాల్గొని, స్వామివారి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా వెంకటాపురం శ్రీ శిరిడి సాయినాధుని భక్త మండలి భక్తులకు విజ్ఞప్తి చేసింది.