వెంకటాపురంలో ఘనంగా కొమురం భీం 85వ వర్ధంతి వేడుకలు
వెంకటాపురం, అక్టోబర్ 7, తెలంగాణజ్యోతి : వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆదివాసి పెద్దలు, పాయం నాగేశ్వరరావు పశువుల సూర్యనారాయణలు కొమరం భీం విగ్రహానికి పుష్పాంజలి ఘటించి పూలమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసి సంఘాల నాయకులు పూనెం రామచందర్రావు, పర్సిక సతీష్, చింత సోమరాజు, చింత సమ్మయ్య, కుచ్చంటి చిరంజీవి మాట్లాడుతూ ఆదివాసుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసి, జల్ జంగిల్ జమీన్ నినాదం సృష్టికర్త అని కొని యాడారు. కొమురం భీం ఆశయాల సాదన కోసం, హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేసి, అమరుడైన వీరుడు కొమరం భీం అని ఆయన బాటలో నడవాలని ఆదివాసి ప్రజలకు పిలుపునిచ్చారు. ఐదవ షెడ్యూల్డ్ ఏరియాలో స్థానిక సంస్థల ఎలక్షన్ లో గిరిజనేతరుల రిజర్వేషన్ ను రద్దు చేయాలని, 5వ ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయ్యాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఇర్ప లక్ష్మి ,సొర్లం నరసమ్మ,అట్టం అంజలి కుమారి, కనితి వెంకటకృష్ణ,కుంజమహేష్,తుర్స కృష్ణ బాబు,తాటి రాంబాబు, ఉండం రామచంద్ర ప్రసాద్, సురిటీ దీపక్, తాటి నాగరాజు,గట్టుపల్లి సంజయ్ ఆదివాసి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.