భవిష్యత్ తరాల కోసమే వనమహోత్సవం
– జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి, జూలై 16, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా భవిష్యత్ తరాల సంక్షేమం కోసం మొక్కలు నాటాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పిలుపు నిచ్చారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన వనమహోత్సవంలో ఎస్పీ పోలీసు అధికారులుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో భారీ స్థాయిలో మొక్కలు నాటాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని, ప్రకృతి అందాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ. నరేష్ కుమార్, డీఎస్పీ నారాయణ నాయక్, సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.