గంజాయి రవాణాదారులను పట్టుకున్న వాజేడు పోలీసులు

గంజాయి రవాణాదారులను పట్టుకున్న వాజేడు పోలీసులు

 గంజాయి రవాణాదారులను పట్టుకున్న వాజేడు పోలీసులు

30 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనాలు సీజ్ 

వెంకటాపురం, ఆగస్టు 30, తెలంగాణ జ్యోతి :  ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం పోలీసులు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నారు. ఈ విషయం ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. ఉదయం 7:30 గంటల సమయంలో వాజేడు ఎస్ఐ సిబ్బందితో కలిసి మండపాక వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా నాలుగు మోటార్‌ సైకిళ్లపై ఏడుగురు వ్యక్తులు వస్తున్నారని సమాచారం ఆధారంగా గుర్తించారు. వారిని ఆపడానికి ప్రయత్నించగా, ముందున్న బైక్ పై ఉన్న ఇద్దరు  తోగరి విష్ణువర్ధన్, జెనజర్ల రేవంత్ లు పట్టుబడ్డారు. వెనుక వస్తున్న మిగతా ముగ్గురు వ్యక్తులు భయపడి తమ బ్యాగులు అక్కడే వదిలి మోటార్‌ సైకిళ్లపై పారిపోయారు. ఈ సందర్భంగా జరిపిన తనిఖీలలో మొత్తం 29.829 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని అంచనా విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందన్నారు. అరెస్టైన వారిని విచారించగా ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి కొనుగోలు చేసి గోదావరిఖని ప్రాంతంలో ఎక్కువ ధరలకు విక్రయిస్తారని ఒప్పుకున్నారు. ఈ వ్యవహారంలో పారిపోయిన నిందితులు మేకల మహేందర్, కొల్లి అజయ్, జంజిర్ల రోహిత్, జంజిర్ల బాలాజీ, ఋత్విక్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఏఎస్పీ తెలిపారు. అదేవిధంగా పారిపోయిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్‌లో చురుకైన చర్యలు తీసుకున్న వాజేడు ఎస్ఐ, సిబ్బందిని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అభినందించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment