వెంకటాపురంలో సార్వత్రిక వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం. 

వెంకటాపురంలో సార్వత్రిక వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లో బుధవారం నూగూరు, చొక్కాల, వెంకటాపురం తదితర గ్రామాల్లో సార్వ త్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఆయుష్మాన్ ఆరో గ్య మందిర్ పథకం కింద ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎదిర పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవ్యశ్రీ పర్యవేక్షణ లో సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం, తల్లి పాల ప్రాముఖ్యత , పౌష్టికాహారం, చిన్నారుల కు వ్యాధి నిరో ధక టీకాలు తదితర అంశాలపై తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా సబ్ సెంటర్ల లో రికార్డుల ను తణిఖి చేశారు. టీకాల కార్యక్రమంలో ఎఎన్ఎంలు ఆశా వర్కర్లు, వైద్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment