పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఉల్లాస్ కోఆర్డినేటర్

On: March 23, 2026 2:23 PM

 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఉల్లాస్ కోఆర్డినేటర్

వెంకటాపురం నూగూరు, మార్చి 23, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను సోమవారం ములుగు జిల్లా ఉల్లాస్ కోఆర్డినేటర్, లైజనింగ్ ఆఫీసర్ డాక్టర్ పీర్ల కృష్ణ బాబు తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిరుతపల్లి బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు. జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో విద్యార్థులకు కల్పించిన సదుపాయాలు, మంచినీటి వసతి, ఇతర సౌకర్యాలను పరిశీలించిన డాక్టర్ పీర్ల కృష్ణ బాబు సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, క్రమబద్ధంగా కొనసాగేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!